KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
- ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
- రియాన్ పరాగ్ మెరుపులు వృధా
- వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలం
- కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.. ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్ ; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు), అజింక్య రహానే (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అంగ్‌క్రిష్ రఘువంశీ (44; 31 5 ఫోర్లు),రాణించారు. ఇనింగ్స్ చివర్లో రింకు సింగ్ (19 నాటౌట్; 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
Also Read: PBKS vs LSG: బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ఆకాష్ ఐపీఎల్ అరంగేట్రం!
లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (4) మరోసారి విఫలమయ్యాడు. వెంటనే కునాల్ సింగ్ రాథోడ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ (34; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (95; 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నారు. యశస్వి అవుట్ అనంతరం ధ్రువ్ జురెల్ (0), వానిందు హసరంగ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో ఆర్ఆర్ కష్టాల్లో పడింది. ఈ దశలో హెట్‌మయర్ (29; 23 బంతుల్లో)తో కలిసి పరాగ్ రెచ్చిపోయాడు. వరుసగా సిక్సులు బాది రాజస్థాన్‌ను రేసులోకి తెచ్చాడు. అయితే సెంచరీ స్వల్ప వ్యవధిలో హెట్‌మయర్, పరాగ్ పెవిలియన్ చేరారు. శుభమ్ దుబే (25), జోఫ్రా ఆర్చర్ (12) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు