IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించినా.. టోర్నమెంట్‌లో వారం రోజుల విరామం తర్వాత వేదికలను మార్చింది. తాజా ప్రకటన ప్రకారం ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్), అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 70 ఉత్కంఠభరితమైన లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-2 జట్ల మధ్య మే 29, గురువారం నాడు…
IPL Update: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య గ్రూప్ మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ మ్యాచ్ మొదట బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా.. తాజా సమాచారం మేరకు మ్యాచ్‌ను లక్నోకు మార్చినట్టు తెలుస్తోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్‌ను ఇప్పుడు లక్నోలో ఆడాల్సి వస్తోంది. దీంతో కోహ్లికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు బెంగళూరులో ఇచ్చే…
గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను భారీ మొత్తాలు వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని ఫ్రాంఛైజీలకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఆటగాళ్లకు గాయాలు కావని తాను చెప్పడం లేదని, కానీ ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను మాత్రం పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి తాను మొగ్గు చూపుతాను అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్…
నిన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, లక్నోని ప్లేఆప్స్ నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ కాస్త అతి చేశాడు. ఏకంగా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మతోనే పెట్టుకున్నాడు. దిగ్వేష్ రాఠి వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని అభిషేక్ శర్మ కవర్ మీదుగా షాట్ కు…
IPL 2025: లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ప్లేఆప్స్ నుంచి లక్నో వైదొలిగింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ప్లేఆప్స్ నుంచి నిష్క్రమించగా, ఈ జాబితాలో చెన్నై, రాజస్థాన్, కేకేఆర్, ఇప్పడు లక్నో వచ్చి చేరింది. అటు గుజరాత్,ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆప్స్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. రేపు ఇరు జట్లు పోటీ పడుతుండటంతో గెలిచిన జట్టు దర్జాగా ప్లేఆప్స్ కు చేరుతుంది. ఇదిలా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌కు చేరుకునే లక్నో ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ జరిగింది. దిగ్వేష్ ఓవరాక్షన్ తో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దిగ్వేష్ సింగ్ రాఠి, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఉగ్రవాదులను లేపేయడమే టార్గెట్‌గా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి పీవోకే, టెర్రరిస్టు శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం.. భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినప్పుడు తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని స్టార్ క్రికెటర్ మోయిన్ అలీ వెల్లడించాడు.
డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ ఇచ్చిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. సుదర్శన్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ ఆడాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ వృధా అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 4…
చివరి మూడు మ్యాచ్ ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలన్న సన్ రైజర్స్ కు హెడ్ రూపంలో భారీ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న మ్యాచ్ కి ముందు ఆ జట్టు స్టార్ ఆటగాడు, ట్రావిస్ హెడ్ కరోనా బారీన పడ్డాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియాలో ఐసొలేషన్ లో ఉన్నాడు.
ఐపీఎల్ లీగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్లేఆఫ్స్ కోసం పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఈ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఈ జట్టు సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. లక్నో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలని భావిస్తోంది. ఈ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10…