ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. 2023లో గుజరాత్‌ను నడిపించిన హార్దిక్ పాండ్యా ఈసారి ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్‌ను హార్దిక్ వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. హార్దిక్ వెళ్లినా…
ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న ఆరంభం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌ను ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 5 సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. ముంబై కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.…
Rishabh Pant Likely To Play IPL 2024: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పంత్ పునరాగమనం చేయనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్య బృందం పంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ పేర్కొంది. రిషబ్ పంత్ త్వరలోనే…
Phil Salt replaces Jason Roy at KKR: ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి వైదొలిగాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్…
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐపీఎల్ 2024 మార్చి 22న ఆరంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ఆరంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అయితే హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో ఎప్పుడో ప్రాక్టీస్ షురూ చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు. ఐపీఎల్…
SRH Team Practice Session in Hyderabad ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ సెషన్‌ను ఆరంభించాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మంగళవారం (మార్చి 5) హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో తొలి టీమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది.…
Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్మెంట్‌కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్‌కే మెంటార్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం…
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి అంటూ ఇవాళ అతను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది.…