Delhi Capitals Captain Rishabh Pant Nearing One Match Ban in IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రెండోసారి జరిమానా పడింది. బుధవారం విశాఖలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా…
Ambati Rayudu on RCB Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంచైజీ ఆడుతున్నా.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, డానియెల్ వెటోరి.. లాంటి అంతర్జాతీయ స్టార్లు జట్టులో ఉన్నా ఆర్‌సీబీ కప్ గెలవలేకపోయింది. అయితే ఆర్‌సీబీ ఇంకా టైటిల్ గెలవలేకపోవడానికి కారణం ఈ స్టార్ క్రికెటర్లే అని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేర్కొన్నాడు.…
ఇన్నింగ్స్ ప్రారంభం చూశాక తాము 220 పరుగుల వరకు చేస్తామనుకున్నామని, 272 స్కోర్ చేస్తామని మాత్రం అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు (277) మిస్ అయినందుకు తమకు ఏమాత్రం బాధ లేదన్నాడు. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడాడని, యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితిపై తమకు ఇంకా తెలియదని శ్రేయస్ చెప్పాడు. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్…
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని, తప్పిదాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్దమవుతామని చెప్పాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ప్రతీ రోజును ఎంతో ఆస్వాదిస్తున్నానని పంత్ చెప్పకొచ్చాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్…
నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్‌లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్…
Suryakumar Yadav Set to Join Mumbai Indians Squad: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీఏకి చెందిన…
Andre Russell Floored By Ishant Sharma’s Super Yorker: టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సూపర్ యార్కర్‌ను సంధించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖ వేదికగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే యార్కర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేకేఆర్ బ్యాటర్ ఆండ్రి రస్సెల్‌ను సూపర్ డెలివరీతో ఇషాంత్ వెనక్కి పంపాడు. ఇషాంత్ యార్కర్‌ను అడ్డుకునే క్రమంలో రస్సెల్ ఏకంగా బొక్కబోర్లా పడ్డాడు. ఆ…
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.