Suryakumar Yadav Set to Join Mumbai Indians Squad: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీఏకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మడమ, స్పోర్ట్స్ హెర్నియాతో సూర్యకుమార్ యాదవ్ బాధపడిన విషయం తెలిసిందే. సర్జరీల కారణంగా సూర్య గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. సర్జరీల అనంతరం మార్చి నుంచి ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్‌నెస్ పరీక్ష చేయగా.. అందులో విఫలమయ్యాడు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఒకటి మినహా అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను అతడు పూర్తి చేసినట్లు తెలిసింది. మిగిలిన ఆ ఒక్క పరీక్షను గురువారం నిర్వహించనున్నారు. ఇందులోనూ ఫిట్‌గా తేలితే మ్యాచ్ ఆడేందుకు ఎన్‌సీఏ నుంచి అనుమతి వస్తుంది.