కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని, తప్పిదాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్దమవుతామని చెప్పాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ప్రతీ రోజును ఎంతో ఆస్వాదిస్తున్నానని పంత్ చెప్పకొచ్చాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘రోజు మాకు ఏది కలిసి రాలేదు. బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. లక్ష్యం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఛేదనలో ఆలౌట్ అయినా సరే దూకుడుగానే ఆడాలనుకున్నాం. మేం కొన్ని రివ్యూలను తీసుకోలేకపోయాం. స్క్రీన్‌పై టైమర్‌ను సరిగ్గా చూడలేకపోయాం. అలానే స్క్రీన్‌లో కొంత సాంకేతిక సమస్య కూడా ఉంది. అయితే కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని.. తదుపరి మ్యాచ్‌లో సానుకూలంగా బరిలోకి దిగుతాం. నేను ఫిట్‌గా ఉన్నాను. ప్రతీ రోజును ఆస్వాదిస్తున్నాను. క్రికెట్‌లో ఒడిదొడుకులు సహజం. మైదనంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే నా లక్ష్యం’ అని తెలిపాడు.
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. సునీల్ నరైన్ (85; 39 బంతుల్లో 7×4, 7×6), రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్ (41; 19 బంతుల్లో 4×4, 3×6) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్ (3/59), ఇషాంత్ (2/43) వికెట్లు తీశారు. ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4×4, 4×6) పోరాడారు. వైభవ్ అరోరా (3/27), వరుణ్ చక్రవర్తి (3/33) తలో మూడు వికెట్స్ పడగొట్టారు.