Andre Russell Floored By Ishant Sharma’s Super Yorker: టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సూపర్ యార్కర్‌ను సంధించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖ వేదికగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే యార్కర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేకేఆర్ బ్యాటర్ ఆండ్రి రస్సెల్‌ను సూపర్ డెలివరీతో ఇషాంత్ వెనక్కి పంపాడు. ఇషాంత్ యార్కర్‌ను అడ్డుకునే క్రమంలో రస్సెల్ ఏకంగా బొక్కబోర్లా పడ్డాడు. ఆ యార్కర్‌కు రస్సెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి.
అద్భుత బంతిని సంధించినందుకుగాను ఇషాంత్ శర్మను ఆండ్రి రస్సెల్ అభినందించకుండా ఉండలేకపోయాడు. బొక్కబోర్లా పడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 35 ఏళ్ల వయసులో అద్భుత బంతిని సంధించిన ఇషాంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ బంతికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో లంబూ ధారాళంగా పరుగులు ఇచ్చినా.. రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Kakarla Suresh: టీడీపీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయండి..!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (277/3) చేసింది. ఓ సీజన్‌లో 250 పైగా స్కోర్లు రెండుసార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.
BALL OF IPL 2024. 🫡
– ISHANT SHARMA, 35 YEARS OLD….!!!!pic.twitter.com/JwePYLaB5s
— Johns. (@CricCrazyJohns) April 3, 2024