ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తుండగా, టైటాన్స్ కు అడ్డుకట్ట వేయాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్ ఓడింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. అంతకముందు ఐదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో(8) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 39, జితేష్ శర్మ 10 పరుగులతో ఆడతున్నారు. అంతకముందు ధావన్(35) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.