వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే…
విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్‌ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్‌లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి…
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం తలుపు తడుతుంది. తెరిస్తే అదృష్టవంతులే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. కొంతమందికి అదృష్టం సముద్రం రూపంలో కలిసి వస్తుంది. ఎప్పటిలాగే ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి వల విసిరాడు. కాసేపటికి వలకు ఏదో చిక్కినట్టు అనిపించింది. వలను పైకి లాగే ప్రయత్నం చేశాడు. బరువుగా అనిపించడంతో ఏదోలా వలను కష్టపడి పైకి లాగాడు. వలలో చేపలకు బదులాగా కొన్ని అట్ట పెట్టెలు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ బిఆర్‌కె భవన్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్పత్రికి సకాలంలో రాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్నీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది.…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…