అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం తలుపు తడుతుంది. తెరిస్తే అదృష్టవంతులే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. కొంతమందికి అదృష్టం సముద్రం రూపంలో కలిసి వస్తుంది. ఎప్పటిలాగే ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి వల విసిరాడు. కాసేపటికి వలకు ఏదో చిక్కినట్టు అనిపించింది. వలను పైకి లాగే ప్రయత్నం చేశాడు. బరువుగా అనిపించడంతో ఏదోలా వలను కష్టపడి పైకి లాగాడు. వలలో చేపలకు బదులాగా కొన్ని అట్ట పెట్టెలు కనిపించాయి. దానిపై యాపిల్ గుర్తు వేసి ఉంది.
Read: ఒమిక్రాన్ కల్లోలం.. అక్కడ 12 మంది మృతి..
ఒపెన్ చేసి చూస్తే అందులో యాపిల్ మొబైల్స్, మ్యాక్ ట్యాబ్‌లు కనిపించాయి. పాడైపోయినవి అందులో పడేశారేమో అనుకొని ఆన్ చేసి చూడగా పనిచేస్తున్నాయి. దీంతో షాకైన ఆ మత్స్యకారులు ఆ బాక్సులను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది. కార్టూన్స్ లో ఉన్న వాటిని అమ్మేస్తే కోట్ల రూపాయల డబ్బు వస్తుందని సంబరపడిపోయాడు. అదృష్టం ఎలా ఎవరి రూపంలో వస్తుందో చెప్పలేం కదా మరి.