మీ iOS 17 iPhoneలో పాస్‌కోడ్‌ను మరిచిపోయారా.. టెన్షన్ పడకండి. మూడు రోజుల వరకు రీసెట్ చేసుకోవచ్చు. మీరు మీ పాస్‌వర్డ్‌ని మార్చిన కొద్దిసేపటికే పాస్‌వర్డ్‌ను మరచిపోయినా.., మీ ఫోన్ లాక్ చేయబడకుండా ఉంటుంది. ఈ ఫీచర్ మొదటి iOS 17 డెవలపర్ బీటాలో గుర్తించబడింది. ఈ సంవత్సరం చివర్లో ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది.
iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను…
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్.
Apple Record Revenue: భారతదేశంలో ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రైమాసిక ఫలితాలను సాధించిందని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం అద్భుతమైన మార్కెట్ అంటూ కొనియాడారు. ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ ఇటీవలే భారతదేశంలో రెండు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల తర్వాత ఇటీవల టిమ్ కుక్ భారతదేశ పర్యటకు వచ్చారు. ముంబై, ఢిల్లీ నగరా్లలో రిటైల్ మార్కెట్ ను ప్రారంభించారు.…
Delivery Boy : ఐఫోన్ లేదా యాపిల్ డివైజ్‌లను ఇష్టపడే వ్యక్తులు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మాత్రమే కాదు, నేడు ఐఫోన్ స్టేటస్ సింబల్‌గా మారింది. ఐఫోన్ , యాపిల్ గాడ్జెట్‌లను దొంగలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు.
Apple's First Store In India: టెక్ దిగ్గజం యాపిల్ తన మొదటి యాపిల్ స్టోర్ ను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా స్టోర్ ప్రారంభం అయింది. భారతదేశంలో యాపిల్‌కి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టోర్‌ను ప్రారంభించబడింది. టిమ్ కుక్ దగ్గరుండి మరీ కస్టమర్లను స్వాగతించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ను ప్రారంభించిన సందర్బంగా ఆ ప్రాంతంలో సందడి…
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.