దావోస్ పర్యటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన ఆయన.. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు.. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు.. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు.. జెడ్ ఎఫ్ ఫాక్స్‌కాన్ సీఈవోతో సమావేశమయ్యారు లోకేష్.. సప్లయ్ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు.. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు…
అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది సిమెంట్ కంపెనీ. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్ గ్రూప్. ఈ గ్రూప్ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం…