అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణం…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్‌లు, విద్యుద్దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది. జూన్ 21న…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం…
21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. మరోవైపు నగరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది.…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
CM Chandrababu: యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో యోగాంధ్ర 2025 ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. యోగాంధ్ర ఏర్పాట్లు, వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. భద్రత ఏర్పాట్లను సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా వివరించారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్,…
విశాఖ వేదికగా యోగాంధ్ర-2025ను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఎంపిక చేశారు. వర్షాలు లేదా భద్రత కారణాల వల్ల మార్పు చేయాల్సి వస్తే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ సిద్ధం అయింది. 3.5 లక్షల నుంచి ఐదు లక్షల మంది…
నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. 10.40కి విశాఖ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్ వరకూ అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను…