Yogandhra 2025: విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి.. ఫుల్ లిస్ట్ ఇదే!
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- యోగాంధ్ర 2025 కోసం ముస్తాబైన విశాఖ
- నేడు విశాఖ నగరానికి వీవీఐపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్‌లు, విద్యుద్దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది.
జూన్ 21న ఉదయం 6.25 గంటలకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఇక 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది. యోగాంధ్ర 2025 నేపథ్యంలో నేడు విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి ఉంటుంది.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
Also Read: Kadapa Municipal: నేడు కడప కార్పొరేషన్ సమావేశం.. భారీ బందోబస్తు ఏర్పాటు! కుర్చీ గోలకు పుల్‌స్టాప్
ఇంటర్నేషనల్ యోగా డే కోసం సాయంత్రం విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6.40 గంటలకు ప్రత్యేక విమానంలో నగరానికి ప్రధాని చేరుకుంటారు. ఇప్పటికే నగరంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్‌ఎస్ డేగాకు వెళ్లి.. ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుంటారు. ప్రధాని మోడీ స్వాగత కార్యక్రమాల్లో పాల్గొని పోర్టు అతిథి గృహానికి వెళ్తారు. మంత్రి నారా లోకేశ్ ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!