నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
Also Read:Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం
ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ అని తెలిపారు. మోడీ సంకల్ప సాధకుడు.. యోగా భారతీయులకు దక్కిన గౌరవమని అన్నారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీ అని కొనియాడారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.