నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు అని.. పవిత్రమైన వృత్తి నర్సింగ్‌ని ఎంచుకున్న అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ఏపీలో నర్సింగ్ కౌన్సిల్‌లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని, నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం…
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు అని ప్రశంసించారు. నర్సుల కష్టంను తాను స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం…