Home
International News
International News News
-
ఐదేళ్ల లోపు చిన్నారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే వారికి కరోనా టీకా
ఐదేళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఆరు నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు… -
కరోనా నుంచి కోలుకున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా… -
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్.. పలు విమానాలు రద్దు
అగ్రదేశం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అటు రహదారులపైనా మంచు భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Read Also: పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి… -
అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే… -
కరోనా దెబ్బకు ఏకంగా ప్రధాన మంత్రి పెళ్లి రద్దు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత భీకర స్థాయిలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధాన మంత్రి వివాహాన్ని అడ్డుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. Read Also: గిన్నిస్… -
గిన్నిస్ రికార్డు: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. వివరాల్లోకి వెళ్తే… బెల్జియంకు చెందిన రూథర్‌ఫర్డ్ అనే 19 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఒంటరిగా… -
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగమ్మాయి
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్ మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి… -
బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు?
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న… -
బ్రెజిల్లో దారుణం..పర్వతం కూలి ఏడుగురి మృతి
బ్రెజిల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా పర్వతం కొండ చరియలు విరిగిపడిపోవడంతో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లోనిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద పర్వతం లోయ గోడ ఒక్కసారిగా పడవలపై పడింది. Read Also:వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలోఉంది: మంత్రి కన్నబాబు ప్రస్తుతం ఈ ఘటనకు… -
మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు. Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్..…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!