పక్షవాతం వచ్చిందంటే నడవడానికి కాలు రాదు, చేయి లేవదు. ఇంకేముంది అతని లైఫ్ అంతటితో ఆగిపోయినట్లే. పక్షవాతం వచ్చిన వారు ఇంకా పర్మినెంట్ గా మంచానికి పరిమితం కావాల్సిందే. వారు ఎటు తిరగాలన్న తిరగలేరు. కనీసం బాత్రూంకు వెళ్దామన్న ఇతరుల సాయమైనా కావాల్సిందే. అంతగా తిరగాలంటే వీల్ ఛైర్ వాడాల్సిందే. అయితే ఫారెన్ కంట్రీస్ లో టెక్నాలజీ పెరిగిపోతుంది. నెదర్లాండ్‌లోని పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి ప్రత్యేక బ్లూటూత్ పరికరం సాయంతో ఎవరి అవసరం లేకుండా నడవగలుగుతున్నాడు.
Also Read :kim jong un: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిమ్.. ఔషధాల కోసం విదేశాల ఆశ్రయం
ఏంటీ అవాక్కయ్యారా పక్షవాతం వచ్చిన వ్యక్తి బ్లూటూత్ నడవడమేంటనీ ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే.. ఆ వ్యక్తి బ్లూటూత్‌ను మెదడు, వెన్నుముకకు అనుసంధానించి సంకేతాలు పంపిస్తుండటం వల్లే వీల్ చైర్ కు పరిమితమైన ఆ వ్యక్తి నడవగలుగుతున్నాడు. ఈ పరికరాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించారు. 12 సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 40 ఏళ్ల గెర్డ్ జాన్ ఓస్కం. అతని వెన్నుముక దెబ్బతిన్నది. ఎన్ని ట్రీట్ మెంట్స్ చేయించుకున్నా.. వెన్నుముక సరిగా రాకపోగా చివరికి అతను పక్షవాతానికి గురయ్యాడు. ఇంకా చేసేదేమీ లేక అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. ఆ వ్యక్తి నడవాలని పట్టుదలతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో వైద్యులు మెదడు, వెన్నెముకల్లో ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. వీటిని బ్లూటూత్‌తో లింక్ చేశారు. అయితే ఈ బ్లూటుత్ మెదడు నుంచి వచ్చే సంకేతాల వల్ల కాళ్లతో పాటు అతని ఇతర శరీర భాగాల కదలికలను నియంత్రిస్తోంది.
Also Read : Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
దీంతో జాన్ ఓస్కం ఇతరుల సహాయం లేకుండానే సొంతంగా నిలబడగలుగుతున్నాడు. నడవగలుగుతున్నాడు, అలాగే మెట్లు కూడా ఎక్కుతున్నాడు. ప్రస్తుతం తయారుచేసిన ఈ బ్లూటుత్ పరికరం పరిమాణం కాస్త పెద్దదిగా ఉందని.. భవిష్యత్తులో దీన్ని చిన్నగా తయారుచేసేందుకు ప్లాన్ వేస్తున్నామని పరిశోధకులు పేర్కొన్నారు. మొత్తానికి నడవాలనే తన ఆశయం ముందు పక్షవాతన్నే ఎదురించాడు జాన్ ఓస్కం. ఇలాంటి పరికరాలు ఇండియాలో కూడా వస్తే.. పక్షవాతం వాళ్లకు ఉపయోగపడుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.