పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఆఫ్ఘన్-పాకిస్తాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి.
Worm in Woman's Brain: వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మెదడులో ఏకంగా 3 అంగుళాల పరాన్నజీవిని వైద్యులు బయటకు తీశారు. మెదడులో పరాన్న జీవి రౌండ్ వార్మ్ను చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసు మొదటిదని చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ కేసును నివేదించింది.
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో…