World Bank Revised India GDP growth: మన దేశానికి ప్రపంచ బ్యాంక్ మంచి బూస్ట్ లాంటి వార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు అంచనాను 6 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 9 శాతానికి పెంచింది. భారతదేశ జీడీపీ గ్రోత్ రేట్‌ను వరల్డ్ బ్యాంక్ అక్టోబర్‌లో 7 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
Reliance Industries-Naphtha Sale: నాఫ్తా అనేది మండే స్వభావం గల ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమం. సహజ వాయువును ఘనీభవనానికి గురిచేయటం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. పెట్రోలియాన్ని స్వేదనం చెందించటం వల్ల కూడా తయారుచేస్తారు. బొగ్గు తారును మరియు పీట్‌ను కలిపి స్వేదన ప్రక్రియకు లోను చేయటం ద్వారా సైతం నాఫ్తాను సంగ్రహించొచ్చు. వివిధ పరిశ్రమల్లో మరియు ప్రాంతాల్లో నాఫ్తాను ముడి చమురు లేదా కిరోసిన్ వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల మాదిరిగా కూడా వాడతారు.
Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు.
Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్.. ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆ సంస్థకు సంబంధించి రోజూ కొత్త కొత్త వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇదొక సరికొత్త డైలీ సీరియల్‌గా మారిపోవటం ఆసక్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ట్విట్టర్‌ను ఒక సోషల్ మీడియా మాదిరిగా హాయిగా ఎంజాయ్ చేసిన యూజర్లు మరిన్నాళ్లు ఇలా కొనసాగే సూచనలు కనిపించట్లేదు.
Google Parent Company Alphabet: గూగుల్ తల్లికి.. ‘‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ’’ అనే మంచి పేరుంది. అన్ని సంస్థల కన్నా ఎక్కువ శాలరీలిచ్చే టెక్నాలజీ దిగ్గజం అని చెబుతారు. కానీ ఈ కంపెనీకి పేరెంట్ సంస్థగా పేర్కొనే ఆల్ఫాబేట్‌కి మాత్రం ఆదాయం పెరుగుతున్నా లాభాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది క్యూ3తో పోల్చితే ఈసారి 27 శాతం ప్రాఫిట్ కోల్పోయింది. ఓవరాల్ రెవెన్యూ 6 శాతం గ్రోత్ అయినప్పటికీ లాభం పడిపోవటం మింగుడు పడట్లేదు. దీంతో ఒక్కసారి వెనక్కి…
Gopuff Layoff: అమెరికన్ కన్జ్యూమర్ గూడ్స్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ గోపఫ్ రీసెంటుగా 200 మందికి పైగా కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను తొలగించింది. జులై రౌండ్ లేఆఫ్ లో భాగంగా వీళ్లను తీసేసినట్లు తెలిపింది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనంతోపాటు నిధుల సమీకరణ నెమ్మదించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాలపై ఫోకస్ పెట్టేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్క్ ఫోర్సును 10 శాతం తగ్గించుకోనున్నట్లు గోపఫ్ జులై నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Biggest Buyout in Asia: ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద కొనుగోలు నమోదు కానుంది. జపాన్‌కి చెందిన తోషిబా సంస్థను అదే దేశంలోని జేఐపీ గ్రూప్ కన్సార్షియం.. టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీ అయిన తోషిబా మార్కెట్ విలువను 16 బిలియన్ డాలర్లకు (2.4 ట్రిలియన్ యెన్‌లకు) పైగా నిర్దారించినట్లు తెలుస్తోంది. బైఔట్ వార్తల నేపథ్యంలో తోషిబా షేర్ విలువ నిన్న సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 5 వేల 391 యెన్స్…