Google Parent Company Alphabet: గూగుల్ తల్లికి.. ‘‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ’’ అనే మంచి పేరుంది. అన్ని సంస్థల కన్నా ఎక్కువ శాలరీలిచ్చే టెక్నాలజీ దిగ్గజం అని చెబుతారు. కానీ ఈ కంపెనీకి పేరెంట్ సంస్థగా పేర్కొనే ఆల్ఫాబేట్‌కి మాత్రం ఆదాయం పెరుగుతున్నా లాభాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది క్యూ3తో పోల్చితే ఈసారి 27 శాతం ప్రాఫిట్ కోల్పోయింది. ఓవరాల్ రెవెన్యూ 6 శాతం గ్రోత్ అయినప్పటికీ లాభం పడిపోవటం మింగుడు పడట్లేదు. దీంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది. కాస్ట్ కటింగ్ కోసం కత్తెర పట్టబోతోంది. ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను లేదా మొత్తం వర్కుఫోర్సులో 6 శాతం మందిని ‘పూర్ పెర్ఫార్మెన్స్’ పేరిట సాగనంపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘ర్యాంకింగ్ సిస్టమ్’ని వాడబోతోంది. తక్కువ ర్యాంక్ వచ్చినోళ్లని తొలగించనుంది. ‘ఆల్ఫాబేట్’లో ప్రస్తుతం లక్షా 87 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.