World Bank Revised India GDP growth: మన దేశానికి ప్రపంచ బ్యాంక్ మంచి బూస్ట్ లాంటి వార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు అంచనాను 6 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 9 శాతానికి పెంచింది. భారతదేశ జీడీపీ గ్రోత్ రేట్‌ను వరల్డ్ బ్యాంక్ అక్టోబర్‌లో 7 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మూడు నెలల్లో ఇండియన్ ఎకానమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులకు లోను కాకుండా దృఢంగా వ్యవహరిస్తుండటాన్ని, అంతర్జాతీయ సంక్షోభాల నుంచి సత్వరం కోలుకోవటాన్ని వరల్డ్ బ్యాంక్ గుర్తించింది.
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలు కూడా ఊహించినదానికన్నా ఎక్కువగా నమోదు కావటంతో మన దేశ వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది. ఈ మేరకు నిన్న మంగళవారం ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్‌ని రిలీజ్ చేసింది. వరల్డ్ బ్యాంక్ భారతదేశ వృద్ధి రేటు అంచనాను లేటెస్టుగా 6 పాయింట్ 9 శాతానికి పెంచినప్పటికీ.. ఇది మిగతా సంస్థల అంచనాలతో పోల్చితే తక్కువే కావటం గమనించాల్సిన అంశం.
read more: Christmas Effect on Stock Market: ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ చైర్మన్ ఆర్.వెంకటరామన్ అంచనా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మూడీస్, ఎస్ అండ్ పీ, క్రిసిల్ మరియు ఎస్‌బీఐ ఎకోరాప్ తదితర ఏజెన్సీలు ఇండియన్ ఎకానమీ గ్రోత్ 7 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని జూన్‌తో పూర్తయిన తొలి త్రైమాసికంలో ఏకంగా 13 పాయింట్ 5 శాతానికి పెరిగిన మన దేశ స్థూల దేశీయోత్పత్తి.. జులై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 6.3 శాతానికి పడిపోయింది.