Gas leak In Airport: మలేసియా ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత..
- మలేసియాలోని ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్..
- సుమారు 39 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత..
- ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas leak In Airport: మలేసియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ దగ్గర గురువారం ఉదయం 11.23 గంటలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు. ఇక, సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. మరో 14 మందిని చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కి పంపినట్లు చెప్పారు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
Read Also: ఏంటీ.. బరువు తగ్గే మందులతో కంటిచూపు పోతుందా..?
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అయితే, ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. ఇక, విడుదలైన గ్యాస్‌ను మిథైల్ మెర్‌కాప్టాన్‌గా ఆగ్నిమాపక సిబ్బంది గుర్తించామన్నారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం చెప్పుకొచ్చింది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యం వేరుగా ఉందని తెలిపింది. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?