Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. శంషాబాద్‌లో ఏదో ఒక అక్రమరవాణా వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో బంగారం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతునే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుధీర్ కుమార్ అనే ప్రయాణీకుడి వద్ద 47 లక్షల విలువ చేసే 827 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
Read also: Astrology : డిసెంబర్ 29, గురువారం దినఫలాలు
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని కరిగించి పేస్ట్ గా మార్చి టీ షర్ట్ వెనుక బాగంకు పూసుకుని తరలించే యత్నం చేశాడు. అతనిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. షాక్‌కు గురయ్యారు. అతనిని విచారించగా.. అధికారుల విచారణలో అక్రమ బంగారం గుట్టు బయట పడింది. ప్రయాణీకుడు సుధీర్ కుమార్ ను అధికారులు అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎవరి కోసం బంగారాన్ని తీసుకు వెళుతున్నాడనే విషయం పై ఆరాతీస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలానే తరలించేందుకు ప్రయత్నించాడా? ఇతను బంగారం కోసమే విదేశాలకు వెళుతున్నాడా? విదేశాల్లో ఇతనికి ఎవరు బంగారం సప్లై చేసేందుకు బంగారం కరిగింది షర్ట్ లో పెట్టి తరలించే ప్రయత్నం చేశారు అనే కోణంలో విచారణ చేపట్టారు.