మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ జూలై 19 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. బుధవారం వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించే వరకు బెయిల్ కొనసాగనుందని ప్రకటించింది.
ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఇవాళ (మంగళవారం) జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద హింసకు సంబంధించిన ఎనిమిది ఆరోపణలపై PTI నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది.