Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీలోని పటియాలా హౌస్‌కోర్టు ఊరట కల్పించింది. నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు నవంబర్ 10 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్, ఇతర పెండింగ్ దరఖాస్తులపై విచారణ నవంబర్ 10న షెడ్యూల్ చేయబడింది. విచారణ కోసం ఫెర్నాండెజ్ తన లాయర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు.
బెయిల్ దరఖాస్తుపై ప్రత్యుత్తరం దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆగస్టు 17న ఢిల్లీ కోర్టులో చంద్రశేఖర్‌పై దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్‌లో ఫెర్నాండెజ్ పేరును నిందితురాలిగా పేర్కొంది.ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే పలుమార్లు ఆమెను విచారణ చేసి ఆస్తులను జప్తుచేసింది.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
Controversy: కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించాలి.. హిందూ మహాసభ వివాదాస్పద వ్యాఖ్యలు
జాక్వెలిన్‌కు సుకేష్ చంద్రశేఖర్ రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అతను నటుడికి మరియు ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన గడియారాలను బహుమతిగా ఇచ్చాడు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి పలు ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేశాడని ప్రస్తుతం జైలులో ఉన్న కన్‌మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
#WATCH | Actor Jacqueline Fernandez leaves from Delhi's Patiala House Court after ED extends her interim bail & protection till November 10th, in the Rs 200 crore money laundering case. pic.twitter.com/sGdHtG8TsD
— ANI (@ANI) October 22, 2022
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!