Brijbhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్.. ఈ నెల 20న మళ్లీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు సమన్లు జారీ చేయడంతో మంగళవారం బ్రిజ్ భూషణ్‌ను హాజరుపరిచారు. అయితే విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యంతర బెయిల్ లభించింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహ నిందితుడు వినోద్ తోమర్‌లకు కోర్టు రెండు రోజుల పాటు రిలీఫ్ ఇచ్చింది. జూలై 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కేసుపై విచారించనున్నారు.
Heavy Rains Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. గంగోత్రి-యమునోత్రి నేషనల్ హైవే మూత
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
బ్రిజ్ భూషణ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్, రాజీవ్ మోహన్ వాదించగా.. ఢిల్లీ పోలీసుల తరఫున అతుల్ శ్రీవాస్తవ వాదించారు. విచారణ సందర్భంగా.. బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండానే ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఏ సెక్షన్‌లోనూ 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షపడే నిబంధన లేదని అన్నారు. అంతేకాకుండా ఈరోజే ఛార్జ్ షీట్ పొందుతున్నామని.. ఈ విషయాన్ని లీక్ చేయబోమని, ఇతరులు కూడా జర్నలిస్టులకు లీక్ చేయవద్దని వాదించారు.
NARFBR Hyderabad Jobs: హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో భారీ వేతనాలు..
రెజ్లర్ల ఆరోపణల కేసులో పలుమార్లు బ్రిజ్ భూషణ్ ను పోలీసులు విచారించారు. కానీ విచారణలో ఏం తేలిందన్న అంశాల్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ఒకవేళ రెజ్లర్లను వేధించినట్లు నిర్ధారణ జరిగితే.. బ్రిజ్ భూషణ్‌కు ఐదేళ్ల జైలు శిక్షపడే ఛాన్సు ఉంది. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు గత నెలలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జూలై 6న బ్రిజ్ భూషణ్ సింగ్ హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై 6 మంది మహిళా రెజ్లర్ల ఆధారంగా అభియోగాలు మోపారు. పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై 354, 354-ఎ, 354డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహ నిందితుడు వినోద్ తోమర్‌పై ఐపిసి సెక్షన్ 109, 354, 354 (ఎ), 506 కింద అభియోగాలు మోపారు.
#WATCH | Former Wrestling Federation of India (WFI) chief and BJP MP Brij Bhushan Sharan Singh arrives at Rouse Avenue Court in Delhi.
Court has summoned him today in connection with the case of sexual harassment allegations by wrestlers. pic.twitter.com/C5EOyiylLa
— ANI (@ANI) July 18, 2023
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?