మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 11వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో.. ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు ఈరోజు సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడివిడిగా విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.