Telangana : మహిళల ఆర్థిక సాధికారతకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి వడ్డీ లేని రుణాల రూపంలో భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం! ఈ నిధులను సోసైటీ ఫర్…
నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించబోతోంది. మహిళలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి బాసటగా నిలిచేందుకు పలు పథకాలను ప్రారంభించనున్నది. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. ఇంతకీ ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Also Read:Alia Bhatt: ఆలియా భట్…
ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని.. వారిని కోటీశ్వరులుగా తయారు చేస్తామని.. ఇదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
నేడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి మంత్రి కేటీఆర్ హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చేరుకుంటారు.