దక్షిణ పెరూలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 17మంది పౌరులు చనిపోయారు. ముందస్తు ఎన్నికలు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 17 మంది మృతి చెందారని ఆ దేశ మానవ హక్కుల కార్యాలయం సోమవారం వెల్లడించింది.