రోడ్డు ప్రమాదాలకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. దీంతో.. రోడ్డు ప్రమాదాల సంఖ్య పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇవాళ విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి…
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.…
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఊరుకొండ మండలానికి చెందిన బాల స్వామి గౌడ్, శివయ్య, యాదయ్య గౌడ్, అంజమ్మ, అనిత, తేజ ఇంద్రకల్ నుంచి దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు. హైదరాబాద్‌కు…
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ…