మద్యం మత్తులో, మానసిక సమస్యలతో కొందరు యువకులు నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. వృద్ధుడి తల పగులగొట్టి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పలాసలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని కాశీబుగ్గ పెట్రోల్ బంకు సమీపంలో టీ దుకాణం దగ్గర కామరాజు అనే వృద్ధుడు టీ తాగు తున్నాడు. అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన సైకో కర్రతో వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. కర్రతో వృద్ధుడి తలపై విచక్షణారహితంగా మోది గాయపరిచాడు. \
Read ALso: Munugode Bypoll: మునుగోడులో బీసీ కార్డ్ వర్కవుట్ అయ్యేనా?
తలకు గాయమై రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధ భవన నిర్మాణ కార్మికుడు కామరాజును చూసిన స్థానికులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీరంగం చేసిన సైకోను జడ గోవిందరావుగా గుర్తించారు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు సైకోపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ శంకరరావు వెల్లడించారు.
Read Also: NFHS : తెలంగాణలో వెజ్ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట