పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు.. ఏపీలోని ఏజెన్సీ వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అటు కర్నాటక, ఇటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల్లో ఏనుగులు వీరవిహారం చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గల జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలోకి గత అర్దరాత్రి ఏడు గజరాజుల గుంపు ఎస్టీ వీధిలోకి చొరబడి అక్కడ ఉన్న రెండు(2) ఎలక్ట్రికల్ 100 కెవిఈ లైన్ ట్రాన్స్ఫార్మర్స్, పదకొండు కరెంట్ స్తంభాలను ధ్వంసం చేసి, గ్రామంలో అలజడి సృష్టించిన సంగతి విదితమే.
Read Also: Mega Power Star Ram Charan: గోల్డెన్ గ్లోబ్ లో ఒక్క మగాడు
గత రాత్రి నుండి పెదకుదమ, సిగణాపురం, చింతలబెలగాం, గదబవలస గామాలకు విద్యత్ సేవలు నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు నీటి, కరంటు కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. విద్యత్ సర్పరా పునరుద్దరించడానికి విద్యుత్ శాఖా అధికారులు గత అర్దరాత్రి నుండి అవిశ్రాంతంగా శ్రమిస్తూ మరమత్తు పనులు త్వరితగతిన చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ ఏనుగుల వలన మా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని, మా గ్రామానికి చెందిన వ్యక్తిని పొలం పని చేస్తుండగా పొలంలో తొక్కి గతంలో చంపేసాయని తెలిపారు. అలాగే కొన్ని నెలల క్రితం మా వీధిలో వృద్దురాలు పొలంలో గొర్రెలు మేపుతుండగా ఆమెపై దాఢి చేయగా కాలు , చేయి విరిగి పోయి మంచం పట్టి లేవలేని స్దితిలో ఉందన్నారు.
తాజాగా గత అర్దరాత్రి మేము పెరటిలో వంట చేస్తుండగా ఏనుగులు అరుపులు వినిపించి భయంతో పరుగులు తీసామన్నారు. కొంత సేపటి వరకు గ్రామంలో ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని ఇప్పటి వరకు కరంటు లేక త్రాగటానికి నీటి లేక నానా అవస్దలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరా త్వరితగతిన పునరుద్దరించాలని కోరారు. ఎలక్ట్రికల్ మండల అధికారి మాట్లాడుతూ యుద్ద ప్రాతిపదికన విరిగి పడిపోయిన విద్యత్ స్తంభాలను తీసి కొత్త స్తంభాలను, అలాగే రెండు కొత్త ట్రాన్స్ ఫార్మర్లను అమర్చే పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ రోజు రాత్రికి గృహాలకు కరెంటు సరఫరా అందిస్తామని, పొలాలకు మాత్రం రెండు రోజుల్లో పనులను పూర్తచేసి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారులు వివరించారు.
Read Also: Boora Narsaiah Goud : ముఖ్యమంత్రి స్పీచ్‌లో పసలేదు.. బీఆర్‌ఎస్‌కు బస లేదు