భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ సవ్యంగా జరగడంపై సందిగ్థత నెలకొంది. మ్యాచ్ జరిగేరోజు ఆదివారం వర్షం పడే అవకాశాలుండడంతో అటు నిర్వహకులు, ఇటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఉప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగినా అభిమానుల్లో ఉండే ఉత్సాహమే మరో లెవెల్ లో ఉంటుంది. హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతున్నా.. ఏపీలో మాత్రం రొటేషన్ ప్రకారం మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చేందుకు ఏడాదికంటే ఎక్కువ సమయమే పడుతూ ఉంటుంది.
Also Read : John Wick: యాక్షన్ మూవీ నటుడి మృతి…
విశాఖలో దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ కు సాగరతీరం వేదిక కాబోతుంది. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారత్, ఆసీస్ వన్డే సమరం కోసం విశాఖ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు స్టేడియంలో ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. అయితే తాజాగా వారికి నిరాశా కలిగించే వార్త కూడా బయటకు వచ్చింది. ఆదివారం విశాఖ వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఉపరితలద్రోణి కారణంగా రెండురోజులుగా పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. విశాకలో ఆదివారం వర్షం పడే అవకాశముండడంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Accident : స్కూటీని ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ కూడా వర్షం కురిసే అవకాశాలు 80శాతం వరకూ ఉన్నాయి. ఏకధాటిగా వర్షం పడిన అవకాశాలు లేవని మాత్రం తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే మ్యాచ్ ఓవర్లను కుదించే పరిస్థితి రావొచ్చు.. అయితే వర్షం పడినా అత్యాధునికా డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో తక్కువ సమయంలోనే గ్రౌండ్ ను సిద్దం చేస్తామని క్యూరేటర్ చెబుతున్నారు. మరోవైపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న వన్డేకు వరుణుడు అడ్డుపడకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశాఖలో ఇప్పటి వరకూ ఇక్కడ జరిగిన 9 వన్డేల్లో వర్షంతో ఒకసారి మాత్రమే మ్యాచ్ రద్దయింది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా కనీసం టీ20 తరహా మ్యాచ్ అయినా జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.