టెస్టు సిరీస్ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పైనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి వన్డేకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దురమయ్యాడు. అతని స్థానంలో హార్థిక్ పాండ్యాకు జట్టు బాధ్యతలను బీసీసీఐ అప్పిగించింది. అయితే భారత వన్డే జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 11 టీ20 ఇంటర్ నేషనల్స్ లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. స్మిత్ ఐదేళ్ల తర్వాత వన్డేలకు కెప్టెన్ గా కనిపించనున్నాడు. అతను 2014 నుంచి 2018 వరకు ఆస్ట్రేలియాకు రెగ్యూలర్ కెప్టెన్ గా ఉన్నాడు.
Also Read : Current Bills: కరెంట్ బిల్లు కట్టమన్న పాపానికి పొట్టుపొట్టుగ కొట్టారు
ముఖ్యంగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ కొంతమంది భారత ప్లేయర్లకు చాలా కీలకంగా మారనుంది. టెస్టు జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవీంద్ర జడేజా.. వన్డేల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సి ఉంది. 2021 నుంచి టీమిండియా ఆడిన వన్డే మ్యాచ్ ల్లో కేవలం మూడింటిలోనే జడ్డూకు చోటు దక్కింది. అతను లేకపోవడంతో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తదితరులు ఏడో స్థానంలో ఆడారు. వీళ్లంతా కూడా తమకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని రాణించారు. ఇలాంటి సమయంలో ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్ లో జడ్డూ రాణించకపోతే ఈ ముగ్గురిలోనే ఒకరికి తన స్థానాన్ని ఇవ్వాల్సి వస్తుంది.
Also Read : Pavitra Lokesh: డబ్బు కోసం పవిత్ర ఎంతకైనా దిగజారుద్ది..
ఇక టీ20ల్లో టాప్ బ్యాటర్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్ లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న అతను.. వన్డేల్లో మాత్రం కేవలం 28.86 సగటుతో పరుగులు చేశాడు. దీంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. అతను ఈ ఫార్మాట్లో అవుటవుతున్న విధానం చూస్తుంటే తన డిఫెన్స్, ఎటాక్ గేమ్స్ మధ్య బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపిస్తుందని చాలా మంది మాజీలు విమర్శించారు. ఇంకా చాలా ఓవర్లు ఉండగా తన 360 డిగ్రీస్ షాట్లు ఆడబోయి అవుటవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆసీస్ తో వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో సూర్యకు బంగారం వంటి అవకాశం లభించినట్లే మరి దీన్ని అతను ఏమాత్రం ఉపయోగించకుంటాడో చూడాలి.
Also Read : Coronavirus: కరోనాపై కేంద్రం వార్నింగ్.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు లేఖ
వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో మూడో పేసర్ స్థానం కోసం శార్దూ్ల్ ఠాకూన్ పోటీలో ఉన్నాడు. అతనికీ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే అవసరమైనప్పుడు బ్యాటుతో కూడా విలువైన పరుగులు చేయడం శార్దూల్ కు ఉన్న పెద్ద ప్లస్. ఈ క్రమంలో తన బౌలింగ్ కూడా మెరుగ్గా ఉందని శార్దూల్ నిరూపించుకుంటే.. అనుభనం ఉన్న అతనికి జట్టులో చోటిచ్చేందుకే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ చక్కని వేదికగా కనిపిస్తోంది. ఈ సిరీస్ లో కనుక శార్దూల్ రాణిస్తే.. జట్టులో మూడో పేసర్ స్థానం అతను అందిపుచ్చుకున్నట్లే..