విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
దేవి నవరాత్రులకు దుర్గ గుడికి ప్రాముఖ్యత ఉందని స్వామి స్వరూపానంద తెలిపారు. చుట్టూ ఉన్న పక్క రాష్టాల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.