విజయవాడలోని ప్రముఖ క్షేత్రమైన ఇంద్రీకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును 3 రోజుల పాటు మూసివేశారు. ఇవాళ్టి సాయంత్రం నుంచి ఈ నెల 22 వరకు ఘాట్‌రోడ్డును మూసి ఉంచనున్నారు. కొండరక్షణ చర్యల పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు కొనసాగనున్నాయి.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 11 నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి.
మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా.
బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు.
చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్ట
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి కరుణ కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారనే సంగతి తెలిసిందే. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఈవోగా రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బదిలీ అయిన ఆజాద్‌కు కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.