Vijayawada: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 11 నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నారు. 11.11.2024, కార్తీక శుద్ధ దశమి/ఏకాదశి రోజున ఉ. గం.07-00లకు శ్రీ భవానీ మండల దీక్షాధారణలు ప్రారంభం కానున్నాయి. 15.11.2024: కార్తీక పూర్ణిమ రోజున శ్రీ భవానీ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది.
Read Also: Amit Shah: మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్‌నాథ్ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన
01.12.2024న శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు ప్రారంభం కానున్నాయి. 05.12.2024 శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది. 14.12.2024 – మార్గశిర పూర్ణిమ (రాత్రి గల) రోజున “కలశ జ్యోతి” ఉత్సవము శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం (రామకోటి), సత్యనారాయణపురం, విజయవాడ నుండి సా. గం.06-30 ని.లకు బయలుదేరి నగరోత్సవముగా శ్రీ అమ్మవారి దేవస్థానమునకు చేరును. డిసెంబరు 21 నుంచీ 25 వరకు దీక్ష విరమణలు ఉండనున్నాయి. డిసెంబరు 25న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు సమాప్తం కానున్నాయి. డిసెంబరు 21 నుంచీ 25 వరకూ ఆర్జిత సేవలు ఏకాంతంగా జరుగునున్నాయి.