ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తూనే ఉన్నాయి. కామాారెడ్డి, నిర్మల్, బైంసా పట్టణాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన నిర్మల్ పట్టణంలోని శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల…
ప్రభుత్వం నిధులు అందిస్తుండడంతో గ్రామాలు వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కే.పొట్టపెల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన పోచమ్మ ఆలయం, రూ.10 లక్షలతో నిర్మించిన భీమన్న ఆలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదా నాన్ని ప్రారంభించారు. పశుసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రె, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేసే…
ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొంటారు. సదస్సులో న్యాయస్థానాల్లో ఐటీ వినియోగం,…
ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల…
కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో…
టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఏఐసీసీ తరఫున శ్రీనివాస కృష్ణన్, మాణిక్కం ఠాకూర్ హాజరయ్యారు. సమావేశం లో ఏడు నియోజక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ లో టీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మైనర్…
దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో…