తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.…
సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నివాసంలో సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు బంధు ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. రైతులు సంక్రాంతిని రైతుబంధు సంబురాలుగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. Read Also: రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు: మంత్రి…
దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది…
మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా…
తెలంగాణలో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీకర్ సెక్షన్ కాలనీలలో ఆలయాల నిర్మాణానికి రూ. 7.56 కోట్లు కేటాయించామన్నారు. దీనికి సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్ లో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. సర్వశ్రేయో…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే…
గత కొంత కాంలంగా రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై అనేక సార్లు అటవీఅధికారులు దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తాజాగా శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.…
పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్‌రైట్ కమిషన్, పలు మహిళా సంఘాలు సీరియస్…