ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది. వారం రోజుల్లో ఇది అతి పెద్ద రెండో భూకంపంగా పేర్కొంది. అయితే సునామీ ప్రమాదం లేదని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి
అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గత వారం మలుకు దీవుల సమీపంలో బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తాజాగా బుధవారం కూడా మరోసారి అదే స్థాయిలో భూకంపం సంభవించింది.
ఇది కూడా చదవండి: Off The Record: పేరుకే కూటమి..! ఆ నియోజకవర్గం కూటమిలో కుతకుతలు..
ఇదిలా ఉంటే సోమవారం ఆప్ఘనిస్థాన్‌లో మజార్-ఎ-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. వందలాది మంది గాయాల పాలయ్యారు. నగరంలో చారిత్రాత్మక బ్లూ మసీద్ దెబ్బతిందని అధికారులు తెలిపారు.