భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అందులో పేర్కొన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్థాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు. ఉగ్రవాదం, పౌరుల హత్యలను వ్యతిరేకించారు. ఇస్లామిక్ బోధనలు, అంతర్జాతీయ సూత్రాలు, మానవ విలువలలో…
Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ రగిలిపోయింది. దీని ప్రతీకార చర్యను పాకిస్థాన్ గుర్తించలేక పోయింది. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ సఫలమైంది. భారత సైన్యం దూకుడు విధానాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ వైమానిక దాడి సంవత్సరాల తరబడి పాకిస్థాన్‌లో ప్రతిధ్వనిస్తుంది. ఈ దాడిలో అత్యంత భయంకరమైన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కుటుంబీకుల రక్తం చిందింది. వందలాది మందిని పొట్టన బెట్టుకున్న ఈ మూర్ఖుడు తన కుటుంబీకుల్లో…
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.