Maldives Row: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు తెలుస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: గతేడాది మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి ప్రదర్శి్స్తున్నాడు. మాల్దీవుల్లో మానవతాసాయాన్ని నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. అటుపై చైనాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ భారత్‌కి యాంటీగా వ్యవహరిస్తు్న్నాడు. మరోవైపు లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి.
పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిస్తోంది. మాల్దీవుల అధికారుల పర్యాటక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో మొత్తం 34,847 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంలో 56,000 మందికి పైగా పర్యాటకులు మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. దాదాపుగా 38 శాతం వరకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య పడిపోయింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..
జనవరి 2024లో 12,792 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, మొత్తం 11,522 మంది ఆ దేశానికి వెళ్లారు. గతేడాది ఇదే నెలలో 19,497 మంది పర్యాటకులు సందర్శించారు. ఈ ఏడాది మార్చిలో 8,322 మంది మాల్దీవులకు వెళ్తే, గతేడాది మార్చిలో 18,099 మంది వెళ్లారు. ప్రధాని మోడీపై మాల్దీవులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండియన్స్ నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది. ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ అంటూ ఇంటర్నెట్లో ట్రెండ్ చేశారు.
2018లో మాల్దీవులకు లక్ష మంది భారతీయులు వెళ్తే, 2019 ఇది 1.6 లక్షలకు చేరింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ దేశాన్ని భారతీయ పర్యాటకులే ఆదుకున్నారని చెప్పాలి. కోవిడ్ -19 ఆంక్షలు సడలించిన తర్వాత ఏకంగా 2.91 లక్షల మంది భారతీయ పర్యాటకు ఆ దేశాన్ని సందర్శించారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలతో భారతీయ పర్యాటకులు తగ్గడంతో, చైనాకు వెళ్లిన ముయిజ్జూ ఆ దేశ పర్యాటకులను తమ దేశానికి పంపాల్సిందిగా అభ్యర్థించాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?