Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
Stock Market Roundup 09-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం బాగా బలహీనపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచనుందనే భయాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ని వెంటాడాయి. దీంతో.. ఉదయం నుంచే రెండు కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్‌కి దిగువన ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్లు కోల్పోయి 59 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 164 పాయింట్లు…
Today (09-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ గురువారం నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలు బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు లాభాలు పంచాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాలు దీనికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చివరి గంటలో బాగా పుంజుకున్నాయి. చివరికి రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 60 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 21…
Today (27-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు భారీ నష్టాల్లో ముగిసింది. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రంగా పెరగటంతో మూడు నెలల కనిష్టానికి పతనమైంది. అదానీ గ్రూప్‌పై హిండర్‌బర్గ్ నుంచి వచ్చిన ఆరోపణలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌నే దెబ్బతీశాయి. దీంతో రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్‌లను కూడా దాటలేని స్థితిలో డౌన్‌లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు.. అంటే..…
Today (23-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం వరకు సానుకూలంగానే కొనసాగి చివరికి మంచి లాభాల్లో ముగియటం విశేషం. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజంతా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ కావటానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు అంతర్జాతీయంగా బలమైన సెంటిమెంట్ సిగ్నల్స్ అందాయి. వివిధ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా వెలువడుతున్నాయి.
Today (20-01-23) Stock Market Roundup: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో ఆ ప్రభావం మన దేశ స్టాక్ మార్కెట్‌పైన కూడా పడింది. దీంతో ఈ వారాంతం రెండు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ శుక్రవారం ఉదయం అతి స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సాయంత్రం కూడా నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. రోజంతా అస్థిరంగానే కదలాడాయి. నిలకడలేక.. నష్టాల నడక సాగించాయి.
Today (03-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం మాదిరిగానే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. ముఖ్యమైన రెండు సూచీలు కూడా ఊగిసలాట ధోరణ ప్రదర్శించాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బయ్యర్లను ఆకర్షించగా రిలయెన్స్ మరియు ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 50 పాయింట్లు పెరిగి 61 వేల 200 వద్దకు చేరింది.
Today (02-01-22) Stock Market Roundup: నూతన సంవత్సరం 2023లో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్ నిర్వహించింది. అయితే.. ఈ కొత్త ఏడాదిలో శుభారంభం లభించలేదు. ఇవాళ ఉదయం రెండు సూచీలు కూడా నష్టాలతోనే ప్రారంభమై ఇంట్రడేలో ఫ్లాట్‌గా కొనసాగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఐటీ, ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగాల్లో షేర్ల అమ్మకాలు జరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. మెటల్ సెక్టార్ స్టాక్స్ ససోర్ట్‌తో ఎట్టకేలకు పుంజుకొని లాభాల్లో ముగిశాయి.
Today (29-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఇవాళ కోలుకుంది. నిన్న బుధవారం నష్టాల్లో ముగిసిన రెండు సూచీలు ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత లాభాల బాటలోకి వచ్చి చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఎర్లీ ట్రేడింగ్‌లో గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో వరుసగా రెండో రోజు కూడా బిజినెస్ లాస్‌లోనే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.