Today (03-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం మాదిరిగానే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. ముఖ్యమైన రెండు సూచీలు కూడా ఊగిసలాట ధోరణ ప్రదర్శించాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బయ్యర్లను ఆకర్షించగా రిలయెన్స్ మరియు ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 50 పాయింట్లు పెరిగి 61 వేల 200 వద్దకు చేరింది.
నిఫ్టీఫిఫ్టీ సూచీ 18 వేల 200 పాయింట్ల వద్ద టెస్టింగ్ ఎదుర్కొంది. చివరికి సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 61 వేల 294 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్సయి 18 వేల 232 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లో మహింద్రా అండ్ మహింద్రా, రిలయెన్స్, హెచ్‌యూఎల్, ఐటీసీ బాగా వెనకబడ్డాయి. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, టాటా మోటార్స్, దివిస్ ల్యాబొరేటరీస్, ఎస్‌బీఐ భారీగానే లాభపడ్డాయి. 3 శాతం వరకు ప్రాఫిట్స్ నమోదు చేశాయి.
read also: RBI Governor on CryptoCurrencies: తదుపరి ఆర్థిక మాంద్యం క్రిప్టోకరెన్సీలతోనే..
దీనికి విరుద్ధంగా ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్.. జీరో పాయింట్ ఫోర్ నుంచి వన్ పర్సంటేజ్ వరకు నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ మంచి పనితీరు కనబరిచాయి. జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజ్ చొప్పున పెరిగాయి. కీలకమైన రంగాల ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ వరకు లాభపడి ఇవాళ్టి ట్రేడింగ్‌లో టాప్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌గా నిలిచింది.
నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ భారీగా పడిపోయింది. జీరో పాయింట్ 4 పర్సంటేజ్ వరకు డౌన్ అయింది. 10 గ్రాముల బంగారం ధర 443 రూపాయలు పెరిగి గరిష్టంగా 55 వేల 621 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా 11 వందల 38 రూపాయలు లాభపడి 70 వేల 709 రూపాయలు పలకటం విశేషం. రూపాయి వ్యాల్యూ 14 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 68 పైసలుగా నమోదైంది.