కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు.
రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందని.. మరోవైపు విపక్షాల అభ్యర్థి ఎవరోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాలు అభ్యర్థి ఎంపిక కోసం ఇవాళ సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోనని…
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇవాళ. జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినంగా ఈరోజుని జాతియావత్తూ జరుపుకుంటోంది. రాజీవ్ గాంధీ 1991, మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ దేశమంతా విస్తృతంగా తిరగుతున్నారు. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీ పెరంబదూర్ కు రాజీవ్ గాంధీ మే 21న ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఎల్ టీటీఈకి చెందిన థాను, శివరాజన్, హరిబాబు తదితరులు అప్పటికే…
ఇప్పుడు దేశమంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగుల గురించే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని, తన సత్తా ఏంటో…
గత వారం బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ, బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఊహించినట్లుగానే ఈ రెండు స్థానాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, బాలీగంజ్‌లో వామపక్షాలు రెండో స్థానంలో నిలవటం విశేషం. మరోవైపు, బీజేపీకి ఈ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. అసన్సోల్ను కోల్పోవడమే గాక ఓట్లు కూడా గణనీయంగా కోల్పోయింది. నిజానికి, 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీలో ఈ క్షీణత…
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకగా జరుగుతున్న…