ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
PM Modi : వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి అంతర్జాతీయ పాడ్కాస్ట్ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో మాట్లాడతారు.
Etela Rajender : నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజలున్న మన భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ, మన నాయకుడు మోదీ అని ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనదని, GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40…
Manmohan Singh: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024, డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ తమ…
CM Revanth Reddy : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానిని గొప్ప ఆర్థికవేత్తలు, నాయకులు, సంస్కర్త , అన్నింటికంటే మానవతావాది అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని, అన్నింటికీ మించి నిర్ణయం తీసుకోవడంలో మానవీయ స్పర్శతో గుర్తించబడ్డారని రేవంత్ రెడ్డి ఒక…
CM Chandrababu : భారత మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి అపార లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మహా మేధావి, ప్రగాఢ రాజకీయ దూరదృష్టిగల నేతగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మరణం…
Manmohan Singh: రెండు సార్లు భారత ప్రధానిగా, సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మనదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేదని. దేశాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా…
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Ponnam Prabhakar : భారత రత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలండర్ ను ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంప్ ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..…
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని…