Dayanidhi Maran: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదానికి తీశాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తూ, కేవలం హిందీ మాత్రమే చదవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి విధానాల కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి.
Congress: మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోలే, తన అగ్రనేత రాహుల్ గాంధీని ‘‘శ్రీరాముడి’’తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ‘‘అతి భజన ప్రో మ్యాక్స్’’గా అభివర్ణించింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించకపోవడంపై అడిగిన ప్రశ్నకు నానా పటోలే సమాధానం ఇస్తూ.. ‘‘శ్రీరాముడు చేసిన పనినే రాహుల్ గాంధీ చేస్తున్నాడు’’ అని అన్నారు.
Venkaiah Naidu: అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శుక్రవారం విజయనగరం చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఉప రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో నేను కంటినీరు పెట్టుకున్నాను. మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి ఇస్తున్నందుకు బాధ పడుతున్నా అని అందరూ అనుకున్నారు. చిన్నతనంలో నా తల్లి చనిపోయారు.. కష్టంతో రాజకీయాల్లోకి వచ్చాను, బీజేపీ పార్టీ నన్ను తల్లిలా పెంచి పెద్దవాడిని చేసింది. ఉపరాష్ట్రపతి అయితే, ఆ తర్వాత…
Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్‌పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది.
Amit Shah: ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థను ఆక్రమిస్తోందని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించిన ఒక రోజు తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఈ రోజు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని,
Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని,…
Bihar Elections 2025: బీహార్ సమరానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరం సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ అయ్యి, అనేక హామీలను గుప్పిస్తున్నారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో వరుస ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నాయి. ఇదే సమయంతో మొదటి దశకు ఎన్నికలకు పోటీ పడుతున్న మహా కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం…
Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూ స్టార్‌పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు…