Cash-for-Query Case: ఢిల్లీ హైకోర్టులో మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట..
- డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలు..
- లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి.. కేసును పునఃసమీక్షించాలని లోక్‌పాల్‌కు ఢిల్లీ హైకోర్టు సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్‌పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అనిల్ క్షేతర్‌పాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. లోక్‌పాల్ మళ్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. లోక్‌పాల్ అండ్ లోకాయుక్తాస్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సంబంధిత నిబంధనలను అనుసరించి, నెల రోజుల్లో అనుమతి అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Read Also: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే, ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హిరానందానీ నుంచి నగదు, బహుమతులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు మహువా మొయిత్రాపై ఉన్నాయి. లోక్‌పాల్ అనుసరించిన విధానంలో స్పష్టమైన లోపాలున్నాయని మొయిత్రా తరఫు న్యాయవాది వాదించారు. సెక్షన్ 20(7) ప్రకారం అనుమతి ఇచ్చే ముందు ప్రజాసేవకుడి వ్యాఖ్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీబీఐ మాత్రం లోక్‌పాల్ విచారణలో మొయిత్రాకు పత్రాలు సమర్పించే హక్కు లేదని, కేవలం వ్యాఖ్యలు మాత్రమే ఇవ్వవచ్చని, మౌఖిక విచారణకు కూడా హక్కు లేదని వాదించింది.
Read Also: Srisailam: మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
ఇక, ఈ వ్యవహారం తుది నిర్ణయం వచ్చే వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా సీబీఐని ఆపాలని ఎంపీ మొయిత్రా కోర్టును కోరింది. ఈ కేసులో భాగంగా సీబీఐ గత జూలైలో లోక్‌పాల్‌కు తన నివేదికను సమర్పించింది. లోక్‌పాల్ సూచనలతోనే మార్చి 21, 2024న అవినీతి నిరోధక చట్టం కింద మహువా మొయిత్రా, దర్శన్ హిరానందానీపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అయితే, సీబీఐ ఆరోపణల ప్రకారం, లోక్‌సభ లాగిన్ వివరాలను హిరానందానీకి షేర్ చేసి, తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించి, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఆమె లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..