US Car Crash: ఐదు రోజుల క్రితం అమెరికా రోడ్డు ప్రమాదంలో అదృశ్యమైన భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు ఆదివారం మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఈ కారు ప్రమాదంలో మరణించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. అప్పటి నుంచి ఖలిస్థానీలకు కంచుకోటగా మారిన కెనడా తదుపరి ప్రధానిపై చర్చలు జోరందుకున్నాయి. చాలా మంది అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీటిలో ఇద్దరు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. కెనడా యొక్క ఈ అత్యున్నత పదవికి చంద్ర ఆర్య, అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు.
ఆపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు.
JD Vance and Usha Chilukuri Vance: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా మారారు. అదే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఆ పోస్ట్ లో ట్రంప్ “సుదీర్ఘమైన చర్చల తరువాత, అనేక మంది ఇతరుల ప్రతిభను…
నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ డోనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఈ నెల మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు అధికారిక ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్ సంపత్ శివంగి ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధూ ప్రాణాలు కోల్పోయాడు. అద్దె విషయంలో జరిగిన గొడవలో హత్యకు గురయ్యాడు.
సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ప్రియురాలి యొక్క హత్యకు కారణం కావడంతో ఆ వ్యక్తికి ఈ శిక్ష విధించబడింది.
పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లోలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా భారతీయ సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.